పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం “ఓజీ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సింగిల్ గ్లింప్స్‌తోనే ఈ సినిమా కు విపరీతమైన క్రేజ్ రావడంతో, పవన్ కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ చిత్రంగా నిలవబోతోందనే తెలుస్తుంది.. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆగస్ట్ 15న “ఓజీ” నుంచి మరో మాస్ టీజర్‌ను విడుదల చేయాలన్న ప్లాన్ యూనిట్ దగ్గర ఉన్నట్టుగా టాక్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి వెళ్లగా, ఇప్పుడు రాబోయే టీజర్‌తో ఈ హైప్‌ను మరింత పెంచాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది..ఇప్పటికే “ఓజీ” సినిమా కేవలం ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక వచ్చే టీజర్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటే, ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..పవన్ అభిమానులు ఏ టీజర్‌కైనా సిద్ధంగానే ఉంటారు, కానీ ఈసారి వస్తుందేమోనని అందరి చూపూ ఆగస్ట్ 15వ తేదీ మీదే ఉంది..









