Search
Close this search box.

  1000 కోట్లు కాదు,4000 కోట్లతో బాలీవుడ్ రామాయణ..!

భారతీయ ఇతిహాసం రామాయణంను తెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఇప్పటికే అనేక మంది దర్శకులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ కూడా చేరిపోయారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు..”రామాయణం బడ్జెట్ ₹1000 కోట్లు కాదు… ₹4000 కోట్లు!” – నిర్మాత కామెంట్ఈ సినిమా నిర్మాణాన్ని ఏడు సంవత్సరాల క్రితమే ప్రారంభించామని పేర్కొన్న నమిత్ మల్హోత్రా,> “మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా స్వయంగా నిధులు సమకూర్చుకుంటున్నాం. కోవిడ్ తర్వాత దీన్ని మళ్లీ ప్రారంభించగానే నాకు చాలామంది పిచ్చివాడివి అనిపించుకున్నారు. కానీ మా లక్ష్యం ఒక్కటే – రామాయణం ప్రపంచం మొత్తం చూడాలి. ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు కాదు… రూ.4000 కోట్లు!” అని ప్రకటించారు.

“ఇంత వరకూ ఏ భారతీయ సినిమా కూడా ఈ స్థాయిలో రూపొందించబడలేదు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకెళ్తున్నాం” అని తెలిపారు. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి, రావణుడిగా యాష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.. ఈ సినిమా మొదటి పార్ట్ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది..!

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు