టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిని రేపుతున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి RC17 ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ రీపీట్ అవుతోందన్న వార్తలు ఇప్పటికే అభిమానుల్లో హర్షాతిరేకం రేపుతున్నాయి.RC17 గురించి మొదటి వార్తలు RRR షూటింగ్ సమయంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచి ఈ కాంబినేషన్‌పై బోలెడు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ పనులు పూర్తిచేసిన తర్వాత, RC17 స్క్రిప్ట్ మీద దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇది పూర్తిగా కొత్త నేపథ్యంతో రూపొందించబడబోతున్నట్లు తెలుస్తోంది.సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారని, 2024 నవంబర్లో ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్రం యొక్క నిర్మాణ బాధ్యతలు ప్రముఖ నిర్మాణ సంస్థ Mythri Movie Makers తీసుకోనున్నారు. సంగీతం కోసం మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్ తీసుకున్నారు..ఇది ‘రంగస్థలం’ తరహా గ్రామీణ నేపథ్యం కాకుండా, పూర్తిగా ఆధునిక నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో రామ్ చరణ్ పాత్ర విభిన్నంగా ఉండబోతుందని, కథ మొదట్లోనే “దిమ్మ తిరిగే” మాస్ మూమెంట్‌తో ప్రారంభమవుతుందన్న టాక్ వినిపిస్తోంది..ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక 2025 ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. అలాగే ఇది పూర్తయిన తర్వాతే సుకుమార్ తన ‘పుష్ప 3’ పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది..ఇప్పటివరకు కథానాయిక గురించి అధికారిక సమాచారం రాలేదు. కానీ శ్రుతి హాసన్, రష్మిక మందన్న జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.









