భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాగ్నమ్ ఓపస్– ‘బాహుబలి’..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందిన ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ రెండు పార్ట్స్ గా ప్రేక్షకులను ముందుకు వచ్చి ఆడియెన్స్ ను ఫిదా చేసింది..రాజమౌళి మేకింగ్ & టేకింగ్, హై రేంజ్ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా ఇండియన్ హిస్టరీ లో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసింది.. అలాగే పాన్ ఇండియా సినిమాలకు మొదట డోర్ ఓపెన్ చేసిన సినిమా కూడా బాహుబలి..ఇప్పుడు అదే విజువల్ స్పెక్టాకిల్ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది — ‘బాహుబలి: ది ఎపిక్’ అనే టైటిల్‌తో.. ఈ రీరిలీజ్ వార్తతో ప్రభాస్ అభిమానులు, రాజమౌళి ఫాలోవర్లు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం రెడీ అవుతున్నారు. కొత్తగా చూసే వారికి ఇది ఒక విజువల్ ఫీస్ట్ కాగా, ఇప్పటికే చూశినవాళ్లకు పాత జ్ఞాపకాలు తిరిగొచ్చే అవకాశం..
‘ది బిగినింగ్’ & ‘ది కన్‌క్లూజన్’ను ఒకే సినిమాగా మిక్స్ చేసి మళ్ళీ ప్రెజెంట్ చేస్తున్నారూ..ఎడిట్ చేసిన సీన్స్
గతంలో యూట్యూబ్‌లో విడుదలైన డిలీటెడ్ సీన్స్‌కు వచ్చిన భారీ రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, మేకర్స్ కొన్ని నెవర్-సీన్ ఫుటేజ్, ఎమోషనల్ ఎక్స్‌టెన్షన్ సీన్స్‌ను కలిపే యోచనలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్..పాత సినిమాల రీరిలీజ్‌లా కాకుండా, ఈసారి టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌తో విజువల్స్‌కి ఫ్రెష్ లుక్, మ్యూజిక్‌కి కొత్త దనం ఇవ్వబోతున్నారు..ఒక్క మాటలో చెప్పాలంటే — ఇది కేవలం రీరిలీజ్ కాదు, పక్కా థియేట్రికల్ ఈవెంట్. ఫ్యాన్స్‌కు మళ్లీ బాహుబలి ప్రపంచంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం.. చూడాలి బాహుబలి రిటర్లీస్ లో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో..









