‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భాగ్యశ్రీ, ఆ ప్రాజెక్ట్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఆమె అందం మాత్రం ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, వరుసగా అవకాశాలు వస్తుండటం, ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది..
ఇప్పటికే విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ సినిమా పూర్తిచేసిన భాగ్యశ్రీ, ప్రస్తుతం దాని విడుదల కోసం చూస్తోంది. మరోవైపు రామ్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లతో కూడిన సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది..ఇక తాజాగా నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇది హీరోయిన్ పాత్రా? లేక మరో ముఖ్యమైన రోల్‌లోనా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టులో భాగ్యశ్రీకి ఛాన్స్ వస్తే, అది ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం అవకాశాలు వస్తున్నా, భాగ్యశ్రీకి ఒక హిట్ మాత్రం తప్పనిసరి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందం ఒక్కటే చాలదు.. ఇండస్ట్రీలో నిలబడాలంటే హిట్లు కూడా తప్పనిసరి..









