మార్విక్ డైరెక్టర్ శంకర్ ఇటీవల ఫ్లాప్స్ తో సతమతమవుతున్నట్లు తెలిసిందే.. గతంలో తీసిన సినిమాల విజయాలతోనే సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు.. అయితే, ఆయన డైరెక్షన్లో వచ్చిన రీసెంట్ సినిమాలు ‘ఇండియన్ 2’ మరియు ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి, ఫలితంగా ఆయనపై విమర్శలు పెరిగాయి.. శంకర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ పెరిగాయి.. ఐతే శంకర్ నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయంపై చర్చ జరుగుతుంది..అయితే, ఈ నేపథ్యంలో శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో, ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా “రోబో”ను గుర్తుచేసుకున్నాడు. కానీ ఇప్పుడు, “వేల్పారి”ను తన నేటి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబడనుంది, ఇది అతను ఇప్పటివరకు రూపొందించిన అతి పెద్ద సినిమా గా మారనున్నదని తెలిపారు..ఈ సినిమాకు అవసరమైన అంశాలు మాత్రమే కాదు, “అవతార్”, “గేమ్ ఆఫ్ థ్రోన్స్” వంటి సినిమాల సాంకేతికత కూడా ఉపయోగించనున్నట్లు శంకర్ చెప్పడం, ఈ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్ అవసరమవుతాయో స్పష్టంగా అర్థమవుతుంది.. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందుతుందని, తన కల త్వరలోనే నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు సాంకేతికంగా సమర్థవంతమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని చెప్పొచ్చు. ఆయన కొత్త ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి పెరిగింది, మరి ఈ కొత్త ప్రాజెక్ట్ విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి..! భారీ బడ్జెట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ శంకర్ ఈ సినిమా ఎంత బడ్జెట్ తో తెరకెక్కిస్తాడో చూడాలి..









