Search
Close this search box.

  విశ్వంభర లో మెగాస్టార్ చార్ట్ బస్టర్ సాంగ్ రీమిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో హిట్ అందకపోవడం అభిమానుల్లో కొన్ని నిరాశలు రేపుతోంది. తక్కువగానే అయినా మంచి కలెక్షన్స్ సాధించినా, “ఖైదీ నెం.150” తరహా బ్లాక్ బస్టర్ మళ్లీ రాలేదు అన్నదే చాలామంది అభిప్రాయం.ఇప్పుడు చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ పై భారీ అంచనాలు ఉన్నాయి..త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా మరో క్రేజీ అప్డేట్ సినిమాపై హైప్ పెంచుతోంది..ఈ సినిమాలో చిరు జోడీగా మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం. హిందీలో ‘నాగిన్’ సీరీస్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మౌని, తాజాగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇప్పటిదాకా పూర్తి కాలేదని సమాచారం, అదే సినిమా విడుదల వాయిదాకు మరో కారణం కావొచ్చు..

ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యం అవుతోంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన అంశం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి అన్నయ్య సినిమాలోని ఐకానిక్ సాంగ్ “ఆట కావాలా.. పాట కావాలా” ను ఈ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి..ఇది నిజమైతే, ఒకవైపు నోస్టాల్జియా ఎఫెక్ట్‌తో అభిమానులు ఉత్సాహపడుతున్నారు. మరొకవైపు, “చిరంజీవి లాంటి స్టార్ హీరో కోసం కొత్తగా ప్రత్యేక పాట ఎందుకు రాయలేదా?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి..

ఇది సంక్రాంతి విడుదలగా భావించినా, అదే సమయంలో రామ్ చరణ్ సినిమా ఉండడంతో చిరంజీవి సినిమా విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం. వీటితో పాటు స్పెషల్ సాంగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదు. ఈ కారణాలతో విడుదల తేదీ ఇప్పటివరకు ఖరారు కాలేదు..ఈ మధ్య వెలువడుతున్న వార్తలన్నింటిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మౌని రాయ్ స్పెషల్ సాంగ్, రీమిక్స్ పాట వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నా, నిజం ఎంతవరకు అనే విషయం క్లారిటీకి రావాల్సి ఉంది..‘బింబిసార’ వంటి హిట్ ఇచ్చిన వశిష్ట, ఈసారి మెగాస్టార్‌తో కలిసి తన రెండో సినిమాగా ‘విశ్వంభర’ రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌, విజువల్ గ్రాండియర్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చిరు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవలేమో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు