మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు హీరోగానే కాకుండా యాంటీ హీరోగా కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే..అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోరూపొందుతున్న భారీ యాక్షన్ సీక్వెల్ సినీమా “వార్ 2” లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తారక్ పాత్రకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది..అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టిం గ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తారక్ ఈ సినిమాలో విక్రమ్ అనే పవర్ఫుల్ స్పై ఏజెంట్‌గా కనపించనున్నాడు.. మిషన్ – భారతదేశం తరఫున మారిపోయిన స్పై కబీర్ (హృతిక్ రోషన్) ని ఎదుర్కోవడం.. వీరిద్దరి మధ్య మైండ్ గేమ్స్, యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకి హైలైట్ కానున్నాయట…ఇది వరకు తారక్ పాత్ర పేరు వీరేంద్ర రఘునాథ్ అని టాక్ వచ్చినా, తాజాగా విక్రమ్ అనే పేరే వినిపిస్తోంది. ఇది నిజమైతే, అభిమానులకు ఒక మేజర్ ట్విస్ట్ అనే చెప్పాలి..ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.. ఎన్టీఆర్ – హృతిక్ కాంబో వెండి తెరపై ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి..









