తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే తేదీకి రెండు పెద్ద సినిమాలు విడుదలవడం పెద్ద విషయం కాదు. కానీ ఆ సినిమాలు ఎవరివో, వాటి స్థాయి ఏమిటో అన్నది మాత్రం కీలకం. ఇప్పుడే 2026 సమ్మర్‌కు టాలీవుడ్లో భారీ క్లాష్ రెడీ అయిపోతోంది..
ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’, మరోవైపు నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వస్తున్న ‘ది ప్యారడైజ్’..ఈ రెండు సినిమాలు ఒకే వారంలో రిలీజ్ అవుతుండటంతో సినీ ఆడియన్స్ ఆసక్తి మామూలుగా లేదు…ఇటివల వరకూ ‘ది ప్యారడైజ్’ వాయిదా పడే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి.. దీంతో ‘పెద్ది’ సోలోగా రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు మారిపోయింది… నాని తాజా పోస్టర్‌తో సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, 2026 మార్చ్ 26న సినిమాను విడుదల చేస్తామని క్లారిటీ కూడా ఇచ్చారు..దాంతో, ఈ రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్ ఇంకా కొనసాగుతుందని స్పష్టమైంది.. ఇక పెద్ది సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తుంది.. ప్యారడైజ్ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ ఇద్దరూ డైరెక్టర్స్ మార్విక్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులు.. ఈ ఇద్దరికి కూడా ఈ సినిమాలు వాళ్ళ రెండో సినిమాలు..దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
నిర్మాణ సంస్థ SLV నిర్మిస్తుంది… సినిమా నాని మరోసారి రఫ్ అండ్ రియలిస్టిక్ రోల్లో కనిపించనున్నాడని సమాచారం.ఈ రెండు చిత్రాల కథలు, ట్రీట్మెంట్ వేర్వేరు అయినప్పటికీ టార్గెట్ మాత్రం ఒకటే – ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం. ఇప్పటికే మెగా ఫ్యాన్స్vs నాని ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది.
.









