2018లో విడుదలైన “ఈ నగరానికి ఏమైంది” సినిమా మొదట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ, సంవత్సరాల తరువాత ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యూత్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. “లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే” అనే థాట్ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, రీ-రిలీజ్ సమయంలో ఆశ్చర్యకరంగా సూపర్ హిట్ అయ్యింది..ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను కనిపించారు. అప్పటి నుంచి ఈ కథకు కొనసాగింపు ఉంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు..అందులో భాగంగా, ఇప్పుడు “ఈ నగరానికి ఏమైంది 2″అనేది ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్ కూడా ఈ సీక్వెల్‌పై ఆసక్తిని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా గతంలో “సీక్వెల్ వస్తుంది” అని సంకేతాలు ఇచ్చారు..ఈ సీక్వెల్‌ను సురేష్ బాబు, అలాగే 35 చిన్న కథ కాదు’ అనే సినిమాను నిర్మించిన సృజన్, సందీప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌ను “ఈNఈ రిపీట్ గా ప్రకటించారు..ఈసారి కూడా అదే గ్యాంగ్ అయిన “కన్యా రాశి గ్యాంగ్”.మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు.. మ్యూజిక్ డైరెక్టర్‌గా వివేక్ సాగర్ తిరిగి సంగీతాన్ని అందిస్తున్నారు..ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..









