Search
Close this search box.

  ఆ సినిమా సీక్వెల్లో హీరో కోసం దిల్ రాజు వెతుకులాట..! త్వరలో ప్రకటన..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా అప్పట్లో టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ఇదీ.. సుకుమార్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. నిర్మాతగా తొలి అడుగులు వేసిన దిల్ రాజుకు ఇది భారీ విజయం..ఐతే దీని తర్వాత వచ్చినా ఆర్య2 పెద్దగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..కానీ ఇప్పటికీ ‘ఆర్య’ ఫ్యాన్‌బేస్ చాలానే ఉంది.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆర్య3 సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆర్య 3 పేరుతో నిర్మాత దిల్ రాజు ఓ టైటిల్ కూడా రిజిస్టర్ కూడా చేశారని న్యూస్ తెగ వైరల్ అయ్యిందీ.. ఈ సినిమా లో హీరోగా రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం.. దీని పై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు..> “నేను, సుకుమార్ మాట్లాడుకుంటున్నప్పుడు ఓ ఐడియా పుట్టింది. అది ‘ఆర్య 3’కి పెర్ఫెక్ట్‌గా సరిపోతుందని అనిపించింది. అందుకే టైటిల్ రిజిస్టర్ చేసాం. కానీ ఇది ఆశీష్ కోసమే రూపొందించిన కథ అనేది తప్పు. కథ సెట్ అయిన తర్వాతే హీరోని ఎంపిక చేస్తాం.

ప్రేమ కథల్లో ‘ఆర్య’ ఎంత ట్రెండ్ సెట్ చేసిందో, ఇది కూడా అలాగే నిలబడిపోతుంది” అని చెప్పారు దిల్ రాజు.. ఆర్య 3నీ సుకుమార్ దర్శకత్వం వహించడంలేదు..ఆయన శిష్యుల్లో ఎవరో ఒకరు చేసే అవకాసం ఉన్నట్లు సమాచారం..”ఆర్య” అంటే చాలా మంది ప్రేక్షకులకు అల్లు అర్జున్‌నే గుర్తుకు వస్తాడు… అలా ఉండగా, ‘ఆర్య 3’లో బన్నీ లేకపోవడం ఓ రిస్క్‌ అనే చెప్పాలి.. కానీ కథే అసలైన హీరో అయి నిలబడితే, చూడాలి మరి ఆ రిస్క్ ను దిల్ రాజు ఎలా చేస్తాడో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు