తాజాగా రిలీజ్ అయిన ‘కుబేర’సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల తన మేకింగ్ స్టైల్‌తో తెరకెక్కించగా, అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న యాక్టింగ్ తో ముఖ్యంగా ధనుష్ పర్ఫార్మెన్స్ కు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది..అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా హిట్ కావడంతో ధనుష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.. తెలుగులో ధనుష్ నటించిన రెండో సినిమా కూడా సక్సెస్ కావడంతో ఆయన ఫ్యాన్స్ లో కూడా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి..ఐతే ధనుష్ మరోసారి తెలుగు సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. మరో డైరెక్టర్ చెప్పిన స్టోరీకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. ఆ డైరెక్టర్ మరెవరో కాదు..ధనుష్ కు ఫస్ట్ తెలుగు సినీమా ‘సార్’ ద్వారా బ్లాక్‌బస్టర్ అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్‌ను 2027లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య సినిమా తో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా తర్వాత ధనుష్ తో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాత నాగవంశీ నిర్మించబోతున్నట్లు టాక్..మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అవుతోంది..









