Search
Close this search box.

  ఒకేసారి మూడు భాషల్లో “దృశ్యం 3”..!

విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ సినిమా తరువాత వెంకటేష్ మరో సినిమాను ఇప్పటికీ వరకు ప్రకటించలేదు.. ఐతే వెంకటేశ్, త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీమ సినిమా చేయబోతున్నట్లు న్యూస్ వచ్చింది.. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.. కానీ వెంకటేష్,త్రివిక్రమ్ సినిమా ఎప్పుడూ మొదలవుతుందో మాత్రం ఇంకా చెప్పలేదు.. ఐతే ఇప్పుడు వెంకటేష్ మరో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది..అంతేకాదు, ఇది వెంకీ ఫ్యాన్స్‌కి మరొక గుడ్ న్యూస్ అని చెప్పాలి.. వెంకటేష్ నెక్స్ట్

‘దృశ్యం 3’ కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే దృశ్యం సినిమాకి సీక్వెల్ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.. ఇప్పుడు దృశ్యం 3 కూడా రాబోతుంది..మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఇప్పటికే ఈ సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు.. ఇదే కథ ఆధారంగా మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం 3’ను ఒకేసారి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు..హిందీ వెర్షన్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదే కానీ, తెలుగు వర్షన్‌కి మళ్లీ జీతూనే దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయట. వెంకటేశ్‌తో ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయని ఇండస్ట్రీ టాక్..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ –

“మలయాళంలో నేను రాసిన కథే హిందీ, తెలుగు భాషల్లో కూడా వాడతారు. అయితే, అక్కడి నేటివ్ టచ్ కోసం కొన్ని మార్పులు చేస్తారు. స్క్రిప్ట్ పూర్తైంది. కానీ హీరోల డేట్స్ కుదరడం కష్టం కావచ్చు. అయినా మూడు భాషల్లో ఒకే రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వేరుగా రిలీజ్ చేస్తే, ఒక్కో భాషలో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది” అని తెలిపారు..అంటే వచ్చే ఏడాది ‘దృశ్యం 3’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు