Search
Close this search box.

  నెల్సన్, ఎన్టీఆర్ కాంబో ఫిక్స్..? హింట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాలిడ్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు.. భారీ లైన్ అప్ తో పాటు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికే

బాలీవుడ్ ఎంట్రీ సినిమా వార్ 2’ సిద్ధమవుతుండగా, మరోపక్క సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.. ఇక ఈ సినిమా తర్వాత ‘దేవర 2’ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ మైథాలాజీకాల్ సినిమా చేయనున్నాడు.. ఇక ఇప్పుడు ఈ సినిమాలే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది.. అయితే ఇందులోనే మరో క్రేజీ కాంబో కూడా ఉందని టాక్.. అదే కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్– ఎన్టీఆర్ కాంబినేషన్… ఈ ప్రాజెక్ట్ పై ఎప్పటి నుండో వార్తలు వస్తున్న ఈ ఇప్పటికి వరకు రూమర్స్ గానే ఉన్నాయి .. కానీ నిర్మాత నాగవంశి ఈ రూమర్స్ చెక్ పెట్టినట్లు సమాచారం..లేటెస్ట్‌గా యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీట్ ఒక్కటి ఫ్యాన్స్‌లో హైప్ పెంచింది. డైరెక్టర్ నెల్సన్ బర్త్‌డే సందర్బంగా –

“మన డియర్ డైరెక్టర్… బిగ్ స్క్రీన్ ట్రీట్ అతి త్వరలో రాబోతుంది”అంటూ చేసిన పోస్ట్, ఈ ప్రాజెక్ట్ పై హైప్ ను మళ్లీ రీస్టార్ట్ చేసింది.. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు – “ఇంకా హింట్స్ వద్దు… డైరెక్ట్ అప్డేట్ కావాలి!” అంటూ కామెంట్స్ పెడుతున్నారు…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు