పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చారిత్రాత్మక యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది.. గతంలో పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు జూలై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పవన్ అభిమానుల్లో జోష్ డబుల్ అయ్యింది.
ఈ సినిమాకి మొదట కొంత భాగం క్రిష్ డైరెక్ట్ చేయగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకోవడంతో కృష్ణం రాజ్ దర్శకత్వం వహించగా, నిర్మాత ఏ.ఎం. రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ నటించగా, బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. ఈ సినిమాకి సంగీతం ఎం.ఎం. కీరవాణి అందించగా, ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని బ్లాక్ బస్టర్ గా ఆకట్టుకున్నాయి. .విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై హైప్ పెంచగా, ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ పెరిగిపోయింది.. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా కోసం గ్రాండ్ లెవల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుండగా, త్వరలోనే పవర్‌ఫుల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. కథ పరంగా చెప్పాలంటే, ఇది ఓ వీరయోధుడి గాథ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ధైర్యంగా పోరాడే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు..చారిత్రాత్మక నేపథ్యం, భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్ అన్నీ కలిసిన ఈ సినిమా నిజమైన విజువల్ ట్రీట్ అని చెప్పడంలో సందేహం లేదు..ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 24 న థియేటర్లలో సందడి చేయనుంది..









