Search
Close this search box.

  స్టార్ హీరో డైరెక్షన్లో యంగ్ హీరోస్ మల్టీస్టారర్..?

టాలీవుడ్‌లో యంగ్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ, తేజ సజ్జా ఒకే సినిమాలో నటించబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నాడు మరెవరో కాదు — కాంతార ఫేం రిషబ్ శెట్టి అని సమాచారం..‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రిషబ్ ప్రస్తుతం ఆ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. దర్శకుడిగా కూడా మెప్పించిన ఆయన, ప్రస్తుతం అదే ప్రాజెక్టును స్వీయ దర్శకత్వంలో పూర్తి చేయబోతున్నాడు.. ఆ తరువాత ‘జై హనుమాన్’ సినిమా చేయనున్నాడు.. దీనిని ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు…ఇంతకుముందే బాలీవుడ్‌లో ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ అనే ప్రాజెక్ట్‌ను కూడా రిషబ్ అనౌన్స్ చేశారు..ఈ మొత్తం లైన్‌అప్ ముగిసిన తర్వాత నిఖిల్, తేజ సజ్జాతో కలిసి ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం ఈ సినిమాకు యూనిక్ కాన్సెప్ట్ సిద్ధమైందని, ఇది తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.. ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు రిషబ్ శెట్టి తీసుకోబోతున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు