రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కింగ్డమ్’ ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేస్తోంది.. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, ఫ్యాన్స్‌కు పక్కా మాస్, స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్టు కనిపిస్తోంది..ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ షూటింగ్ ఇప్పటికే ముగిసిపోయినప్పటికీ, కొంత ఫైనల్ అవుట్‌పుట్ అనుకున్న స్థాయిలో రాలేదని సమాచారం. అందుకే, కొన్ని కీలక సీన్లను తాజాగా గోవాలో రీషూట్ చేస్తున్నారు.. సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ చేయకుండా, ప్రేక్షకులకు బెస్ట్ వర్షన్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కొత్త అవతారంలో కనిపించనుండగా, ఫ్రెష్ ఫేస్ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా ఆకట్టుకోనుంది. యాక్షన్, డ్రామా, స్టైల్ – అన్నింటినీ కలగలిపే ఈ చిత్రం సరికొత్త అనుభూతి ఇవ్వనుంది..రీషూట్, ప్యాచ్ వర్క్ పూర్తైన తర్వాత, మేకర్స్ గ్రాండ్ లెవల్లో ప్రమోషన్లు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ ప్రోమో షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు టాక్. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను జూలై 4, 2025 న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు..









