పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన నటిస్తున్న సినిమాల్లో నుండి ఒక్కొకటిగా అప్డేట్స్ వస్తున్నాయి.. చాలా కాలం పెండింగ్ లో ఉన్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గోని ఆ సినిమాను పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేశారు.. అలాగే పవన్ కళ్యాణ్, సుజిత్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ కూడా షూటింగ్ స్టార్ట్ చేశారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు..ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.. గతంలో ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.. ఐతే ఇప్పుడు పవన్ తన డేట్స్ ను ఇచ్చినట్లు సమాచారం..
షూటింగ్ జూన్ నెల నుంచి వేగంగా ముందుకెళ్లనుంది. గతంలో వీళ్లిద్దరూ కాంబోలో వచ్చినా గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికి తెలిసిందే.. ఈ సినిమా భారీ హైప్ కూడా ఉందీ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూన్నారు.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు..









