సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా మారిపోయారు.. అటు పాలిటిక్స్ తో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు.. విజయశాంతి సినిమాలు ఎంచుకుంటే, అవి ఆమె పాత్రకు గౌరవం ఉండేలా, స్పష్టమైన ప్రాధాన్యం కలిగినవే కావాలి. గతంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు లేదా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో ఆమె పాత్రలు కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.. అవి కేవలం గెస్ట్ రోల్స్ కాకుండా, కథను మలుపు తిప్పే స్థాయిలో ఉండటం గమనించాల్సిన విషయం..అలా ఆమె చేసే సినిమాల్లో పాత్రకు మంచి స్కోప్ ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటుంది.. ఐతే ఇప్పుడు ఆమె ఓ సినిమాలో కీలక పాత్ర చేయబోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న బాలయ్య హీరోగా బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 లో విజయశాంతి నటించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.., ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. బాలకృష్ణ – విజయశాంతి జోడీకి పాత కాలం నుంచి మంచి క్రేజ్ ఉంది, అది నిజమే. అయితే, విజయశాంతి ఇప్పుడు ఒక “ప్యూర్లీ కంటెంట్ ఓరియెంటెడ్” దృష్టికోణంతో పాత్రలు ఎంచుకుంటున్నారు.. అఖండ-2 ఓ మాస్ యాక్షన్ డ్రామా కావడం, ప్రధాన ఫోకస్ బాలయ్య పాత్రపై ఉండే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల, విజయశాంతికి ఫుల్ లెంగ్త్, డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఉంటుందా? అన్నది సందేహమే. ఒక వేళ బోయపాటి ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రను డిజైన్ చేస్తే తప్ప, విజయశాంతి ఒప్పుకునే అవకాశం తక్కువగా ఉంది.. అందువల్ల, ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే ..









