Search
Close this search box.

  డైలమాలో మెగాస్టార్ విశ్వంభర..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వంభర.. ఈ సినిమా పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి… జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో సొషియో-ఫాంటసీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమాను బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నాడు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు… ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే టీజర్ వచ్చిన తర్వాత గ్రాఫిక్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, మేకర్స్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.. అందుకని వీఎఫ్ఎక్స్ టీం కూడా మార్చినట్లు సమాచారం.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ చూపిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది..

హాంకాంగ్, హైదరాబాద్‌లలో ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారని, వీఎఫ్ఎక్స్ కోసం సుమారు 75 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది..ఈ కారణంగా మేలో రిలీజ్ అనే మొదటి టార్గెట్ నుంచి జూన్, జూలైకి, ఇప్పుడు తాజాగా సెప్టెంబర్‌కి వాయిదా పడే అవకాశముందని టాక్.. అదే జరిగితే బాలకృష్ణ సినిమా‌తో పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు..మెగా ఫ్యాన్స్ విశ్వంభర కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. టీజర్ లో చిరంజీవి లుక్ అభిమానుల మన్ననలు అందుకుంది.. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇదివరకే జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని గుర్తుచేస్తోందన్న టాక్ ప్రచారంలో ఉంది..విశ్వంభర సినిమాపై విడుదల తేదీకి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదన్నదే వాస్తవం. వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ సమయం పడుతున్నా, క్వాలిటీ విషయంలో మాత్రం మేకర్స్ రాజీపడే ప్రసక్తి లేదని తెలుస్తోంది. ఈ సినిమాపై అధికారిక సమాచారం త్వరలోనే రావొచ్చునని తెలుస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు