పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ సినిమా “హరిహర వీరమల్లు… నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఓ వీరుడిగా ప్రేక్షకులను విభిన్న పాత్రలో అలరించబోతున్నారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది.. పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరక సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.. ఐతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.. పవన్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం..
ఈ సినిమా తాజా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ వార్తతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వీరాభిమానులకు ఇది నిజమైన పండుగే..! హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో విడుదల కావల్సి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ ఆందోళనలు, బిజీ షెడ్యూల్స్ కారణంగా, సినిమా షూటింగ్ కు డేట్స్ ఇవ్వలేకపోయారు. ఫలితంగా విడుదల తేదీ పలు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు చివరికి అన్ని క్లారిటీతో జూన్ 12ని ఫిక్స్ చేశారు.ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై, ఎం.ఎం. రత్నం సమర్పణలో, ఏ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు ఒక పాన్ ఇండియా సినిమా కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది..









