ఇండియన్ సినిమా గర్వంగా చెప్పుకునే పాన్ ఇండియా మూవీ ‘RRR’ గతంలో సాధించిన విజయాన్ని మరిచే ఉండడంటే అతిశయోక్తి కాదేమో… రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్, విడుదలైన ప్రతీ చోట బాక్స్ ఆఫీస్‌ను దుమ్ములేపింది. ఇప్పుడు ఈ మాసివ్ మూవీకి సీక్వెల్ వస్తోందన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.. తాజాగా లండన్‌లో జరిగిన ‘RRR కాన్సర్ట్’ సందర్భంగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి పాల్గొన్నారు.. ఈ ఈవెంట్లో జరిగిన సరదా సంభాషణలో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇచ్చిన సమాధానం ఇప్పుడు అభిమానుల్లో హంగామా రేపుతోంది.
ఎన్టీఆర్ rtr 2 ఉంటుందా అని అడిగారు:
“త్రిపుల్ ఆర్ 2 ఉంటుందా?”
రాజమౌళివెంటనే సమాధానం:
“ఎస్!” అని చెప్పారు..ఈ క్లిప్ వైరల్ కావడంతో, ఇక ‘RRR 2’ కన్ఫర్మ్ అనే టాక్ ఇండస్ట్రీ అంతటా వ్యాపించింది. అభిమానులు అప్పుడే తమ ఊహలను ఊపందిస్తున్నారు..ఇప్పటికే ఈ ముగ్గురూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే RRR 2 సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం…ఈలోగా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రాజమౌళి గురించి తెలిసిందే, ఒక్కసినిమా కోసం నాలుగేళ్ల సమయాన్ని వెచ్చిస్తారు. కనుక RRR 2 ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు… ఇప్పటివరకు అభిమానులు కోరుకున్నదే జరుగుతోంది. త్రిపుల్ ఆర్ లాంటి మాగ్నం ఓపస్‌కు సీక్వెల్ రావడం అంటే కేవలం తెలుగు సినిమా కాదు, భారతీయ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం..‘RRR 2’ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే వేచి చూస్తున్నారు. ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం కౌంట్‌డౌన్ మొదలైంది..









