విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్య శ్రీ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ‘కింగ్డమ్’.. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న హీరో విజయ్ పొందదేవరకొండ ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు.. ఈ సినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ విడుదలయ్యి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.. ఈ సినిమాని మే 30న విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తుంది.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది..
“ప్రస్తుత దేశంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు చేయడం సాధ్యపడక పోయింది… అందుకే సినిమా విడుదలను జులై 4కు వాయిదా వేసాం.” అని కింగ్ డమ్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది..ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది…









