బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టాడు. భారతీయ ఇతిహాసాల్లో ఒకటి అయిన మహాభారతం ను ఐదు భాగాలుగా తెరకెక్కించాలన్నది అతని డ్రీమ్. ఈ గ్రాండ్ వెంచర్‌ను అత్యున్నత స్థాయిలో రూపొందించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి..సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంతున్నట్టు సమాచారం… దీనికి సంబంధించి మొదటి పార్ట్ దర్శకత్వం వహించబోయేది ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ టాప్ స్టార్లను క్యాస్ట్ అలాగే చేయాలని అమీర్ ఖాన్ భావిస్తున్నట్లు సమాచారం.. ముఖ్యంగా సౌత్ నుండి ఈ సినిమాలో కీలక పాత్రలకు బడా స్టార్ నటీనటులను ఎంచుకునే పనిలో ఉన్నాడు..
ఈ క్రమంలో, అర్జునుడి పాత్ర కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను అమీర్ ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్.. మహాభారతం లో అర్జునుడిది ముఖ్య పాత్ర కావడంతో.. ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బావుంటుంది అని అమీర్ ఖాన్ భావించినట్లు సమాచారం.. ఇటీవల అట్లీ సినిమా కోసమై ముంబై వెళ్లిన బన్నీ, అమీర్‌ను వ్యక్తిగతంగా కలిశాడని సమాచారం.అప్పుడు ఈ సినిమా అర్జునుడి పాత్ర గురించి వివరించినట్లు సమాచారం.. అల్లు అర్జున్ కూడా అర్జునుడి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమచారం…పుష్ప సిరీస్ తో బన్నీ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళిపోయింది.. ఒకవేళ బన్నీ గనక అర్జునుడి పాత్ర చేస్తే ఈ సినిమా పై ఇప్పటి నుండి భారీ హైప్ పెరగడం ఖాయం అని చెప్పాలి.. ఇక భన్సాలీ కూడా గతంలో బన్నీతో సినిమా చేయాలని ఆసక్తి చూపించారన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు మహాభారతం ప్రాజెక్ట్‌లో వీరిద్దరూ కలిసి పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఈ ప్రాజెక్ట్‌ను ఐదుగురు దర్శకుల చేత, ప్రతి ఆరు నెలలకు ఒక్కో భాగం విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం బడ్జెట్ దాదాపు రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అమీర్ ఖాన్ నిర్మించబోతున్నట్లు సమాచారం… ఇందులో అమీర్ ఖాన్ తానే కృష్ణుడి పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిగతా ప్రధాన పాత్రల్లో కూడా భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంటుందని తెలుస్తోంది..









