యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ — అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసిన తారక్, కంఫ్లీట్ యాక్టర్ అనబడే పదానికి స్టార్. వరుస హిట్స్‌తో ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు — ఒకటి బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు.. మరొకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్.. ఈ నెల 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సర్ప్రైజ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మైత్రి మూవీ మేకర్స్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు వారు ప్రకటించారు..ఇంతలో తారక్ ఫ్యాన్స్‌కి మరో స్పెషల్ ట్రీట్ కూడా రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కూడా బర్త్‌డే కానుకతో సందడి చేయనుంది. ఎన్టీఆర్ ఇందులో నెగటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఒకే ఫ్రేమ్‌లో తారక్ – హృతిక్ కనిపించే సీన్స్‌కి థియేటర్లు హల్చల్ చేయడం ఖాయమన్నది ఇండస్ట్రీ టాక్. ఐతే వార్ 2 ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.. ఐతే ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను కూడా స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోందట.అంతేకాదు తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్, ఎన్టీఆర్ కాంబో సినిమా పై కూడా అఫిషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం.. ఐతే ఈసారి ఎన్టీఆర్ బర్త్ డేకి ఫ్యాన్స్ తిబుల్ ట్రీట్ అన్నమాట..









