Search
Close this search box.

  అల్లు అర్జున్,అట్లీ సినిమాలో స్పెషల్ రోల్ లో స్టార్ హీరో..?

అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

ప్రస్తుత పాన్-ఇండియా ట్రెండ్‌లో తెలుగు హీరోలు తీసుకొస్తున్న భారీ సినిమాలు చూసి ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్, గ్రాండియస్ సెట్టింగ్స్, లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్‌లతో రూపొందుతున్న సినిమాలు ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఒక సినిమా ఉంటే… అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రానున్న చిత్రం అని చెప్పొచ్చు.ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడే అందులో ఉన్న విజువల్స్‌, టెక్నికల్ స్టాండర్డ్స్ చూసి ఇది హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. తాజా సమాచారం ప్రకారం, బన్నీ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో బన్నీ నటించనున్నాడు. ఇందుకోసం ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని, పాత్రల కోసం శారీరకంగా, మానసికంగా ఎక్కువగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.. ఈ సినిమా జోనర్ సైన్స్ ఫిక్షన్ అని సమాచారం.. సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మరో లెవెల్‌కి తీసుకెళ్లాలని అట్లీ – బన్నీ ఇద్దరూ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఉండేలా మేకింగ్ ప్లాన్ చేస్తున్నారట…ఈ సినిమాకు నటీనటులను ఎంపిక చేయడం అంత ఈజీ కాదట. ఎందుకంటే ప్రతీ పాత్రకీ ప్రత్యేకత ఉండాలి. అందుకే ఇప్పటివరకు పాత్రల వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టీమ్ వర్గాల్లో వినిపిస్తోంది..ఇప్పటికే పాన్-ఇండియా చిత్రాల్లో టాలీవుడ్ – బాలీవుడ్ మిక్స్ అనేది ట్రెండ్‌గా మారిన నేపథ్యంలో, ఈ సినిమాలో కూడా అలాంటి క్రాస్ ఓవర్ క్యాస్టింగ్ చూడొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు