తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహేష్ బాబు, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌లోనూ భారీ ఫ్యాన్‌బేస్ ఉంది… ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్లు ఎన్నో ఉన్నాయి. చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం’ మిక్స్‌డ్ టాక్ వచ్చింది.., ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమాగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్-వరల్డ్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నారు. ‘బాహుబలి’ మరియు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే రికార్డు స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.. ఈ కాంబోలో వచ్చే సినిమా కోసం ఆడియెన్స్ ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు..ఈ భారీ ప్రాజెక్ట్ తరువాత మహేష్ బాబు, తన లైన్ అప్ ను సాలిడ్ గా ఉండేలా చేసుకుంటున్నట్లు సమాచారం.. SSMB 29 తరువాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నట్టు టాక్. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’ ‘యానిమల్ పార్క్’ సినిమాలతో బిజి గా ఉన్నాడు.. ‘యానిమల్’ సినిమా సూపర్ హిట్ కావడంతో, దాని సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలున్నాయి.. మహేష్ సందీప్ కాంబో పై ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి..వాస్తవానికి, అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత సందీప్, మహేష్ బాబుకు ‘డెవిల్’ అనే కథను చెప్పినట్టు సమాచారం..కానీ ప్రాజెక్ట్ అప్పట్లో పట్టాలెక్కలేదు… అనిమల్ సినిమా ప్రమోషన్ లో మహేష్ సినిమా గురించి మాట్లాడారు సందీప్.. ఆ సినిమా డెవిల్ .. ఆ సినిమా అనిమల్ కన్నా చాలా వైల్డ్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు.. ఇప్పుడు రాజమౌళి సినిమా పూర్తయ్యే సమయానికి ఆ కథనే రివైజ్ చేసి, మహేష్‌తో తెరకెక్కించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే రాజమౌళి సినిమా పూర్తవడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడే అవకాశం ఉన్నందున, సందీప్ ఆ లోపు తన ప్రస్తుత ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయనున్నాడు.









