Search
Close this search box.

  పూరీ, విజయ్ సినిమాలో విరసింహా రెడ్డి విలన్..?

పూరి, విజయ్ సేతుపతి కాంబో పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.. పూరి జగన్నాథ్ రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ ఆడియన్స్ అందరికి షాక్ ఇస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను మే లో సెట్స్ పైకి తీసుకెళ్లి కేవలం మూడు నెలల్లో ఫినిష్ చేసే ఆలోచనలో పూరి ఉన్నట్లు సమాచారం..అంతేకాదు ఈ సినిమాను సైలెంట్ గా ఫినిష్ చేసి దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..ఐతే ఈ సినిమాలో విలన్ గా విరసింహా రెడ్డి విలన్ దునియా విజయనీ తీసుకున్నారు.. ఇది ఒక పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. క్యాస్టింగ్ నుంచి, బజ్ బిల్డింగ్ వరకు అన్నీ చాలా ప్లానింగ్‌తో జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ వంటి విభిన్న ఇండస్ట్రీల నుండి వచ్చిన నటులను చేర్చడం ద్వారా ఈ సినిమా స్కేలు పెరిగింది.. . స్పెషల్ గా దునియా విజయ్ లాంటి దర్శకుడు నటుడిని ఒప్పించగలగడం, పూరి బ్రాండ్ కి ఉన్న ఇంపాక్ట్ ని చూపిస్తుంది.. ఈసారి పూరీ పూర్తిగా స్టోరీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కాస్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది..ఇక టైటిల్, జానర్, బ్యాక్‌డ్రాప్ అధికారికంగా రాకపోయినా, “బిజినెస్ మెన్”, “పోకిరి” స్టైల్ లో మాస్ కమర్షియల్ కథ ఉండబోతోందన్న టాక్ ఆసక్తికరంగా ఉంది. ఇది పూరి కి కంబ్యాక్ మాత్రమే కాకుండా, తన బ్రాండ్ ను మరింతగా రీడెఫైన్ చేసే అవకాశం కూడా కావచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు