అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న సినిమా పై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ రూమర్స్ తో సినిమా పై భారీ హైప్ పెరుగుతుంది..
పుష్ప తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.. జవాన్ సినిమా తరువాత అట్లీ చేస్తున్న సినిమా ఇదీ..ఐతే ఈ సినిమా సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రాబోతున్నట్లు సమాచారం.. హాలీవుడ్ రేంజిలో భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా కోసం కొత్త మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు.. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఐతే ఇప్పుడు ఒక హీరోయిన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. టాలీవుడ్ కి సీతారాం సినిమాతో పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నట్లు సమాచారం..
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం దక్షిణాది సినిమాలలో మంచి పాపులారిటీతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ‘సీతారామం’ సినిమాతో వచ్చిన క్రేజ్‌కి తోడు, నాని, విజయ్ దేవరకొండ, ఇప్పుడు ప్రభాస్, అడివి శేష్ లాంటి హీరోల సరసన అవకాశాలు రావడం ..ఇప్పుడు మరో సారి అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది..
ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో మృణాల్ కథానాయికగా ఎంపిక కావడం, ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఈ కాంబినేషన్‌కి ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా, ఆమె పాత్రకు బలమైన ఎమోషనల్ డెప్త్ ఉండే అవకాశం కనిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తే మిగిలిన క్యాస్టింగ్ వివరాలు కూడా బయటపడతాయి… ఈ సినిమా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది..









