నాని ‘హిట్-3’ తో మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనున్నాడు. అర్జున్ సర్కార్ పాత్రలో నాని మాస్, ఇంటెన్స్ షేడ్స్‌తో కనిపించనున్నాడని అంచనాలు ఉన్నాయి… ఇక వెంటనే ఆయన తదుపరి చిత్రం ‘ది పారడైజ్’ సెట్స్‌పైకి వెళ్తుండటం, మే 2 నుంచే షూటింగ్ ప్రారంభమవుతుండటం చూస్తే, నాని గట్టిగానే ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరోసారి సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి హైప్ ఏర్పడింది.. ఈ మధ్య వచ్చిన సినిమా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.. దీంతో ఈ కాంబో పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..అయితే ఈ సినిమా నుండి మరీ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ విలన్‌గా ఎంపిక కావడమే. ‘కిల్’ చిత్రంలో అతని పెర్ఫార్మెన్స్ చురుకుగా ఉండటంతో, నాని సరసన విలన్‌గా బలమైన కాంపిటీషన్ ఇవ్వగలడు. అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఎలివేషన్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది..చూడాలి మరి ఈసారి ఈ కాంబో బాక్సాఫీసు వద్ద ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుందో..









