Search
Close this search box.

  అట్లీ మాస్టర్ ప్లాన్..! బన్నీ సినిమాలో హాలీవుడ్ యాక్టర్..?

అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారో అని బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. బన్నీ పుట్టిన రోజున డైరెక్టర్ అట్లీ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాకు చాలామంది హాలీవుడ్ రేంజ్ టెక్నీషియాన్స్ పనిచేయబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా జోనర్ కూడా ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని సమాచరం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ సూపర్ పవర్స్ ఉండే క్యారెక్టర్ లో కనిపిస్తారని సమాచారం.. ఐతే ఇప్పుడు ఈ సినిమాలో ఓ హాలీవుడ్ యాక్టర్ కూడా ఓ కీ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.. దాని కోసం ప్రముఖ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నీ కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అట్లీ సినిమాల్లో ఇప్పటికే స్టైల్, ఎమోషన్, మాస్ అనేది చాలా బాగా బలంగా ఉంటాయి. అల్లు అర్జున్‌కి ఉన్న పాన్-ఇండియా క్రేజ్, అట్లీకి ఉన్న కమర్షియల్ విజన్—ఇద్దరూ కలిసిన ప్రాజెక్ట్‌లో విల్ స్మిత్ కనిపిస్తే, అది నిజంగా ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది.అల్లు అర్జున్ vs విల్ స్మిత్ – పుష్ప తరువాత ఇది ఇంకో ఇంటర్నేషనల్ లెవెల్‌ ఎంటర్‌టైనర్ అవుతుందా అన్న హైప్ ఖచ్చితంగా ఉంది.. ఈసారి అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు