పూరీ జగన్నాధ్ గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ అవ్వడంతో ఇక పూరి కెరియర్ అయిపోయిందని చాలా మంది అనుకున్నారు.. కానీ అలా అనుకున్న ప్రతిసారి పూరీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ అందరికి సర్ప్రైజ్ ఇస్తున్నాడు.. ఇప్పుడు కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.. విజయ్ సేతుపతి కథ, క్యారెక్టర్ బాగుంటేనే సినిమా ఒప్పుకుంటాడు.. అలాంటి విజయ్ సేతుపతిని పూరి జగన్నాథ్ ఏ కథ చెప్పి ఒప్పించాడో అని అందరూ షాక్ అయ్యారు..
లైగర్ వల్ల వచ్చిన నెగటివ్ వేవ్ నుంచి పూరీ పూర్తిగా బయటపడటానికి ఈ సినిమానే ఓ గేమ్ ఛేంజర్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
విజయ్ సేతుపతి లాంటి మల్టీ టాలెంటెడ్ నటుడిని తీసుకోవడం, టబు – రాధికా అప్టే లాంటి హీరోయిన్స్ కాంబోని సెట్ చేయడం చూస్తే ఇది ఒక స్ట్రాంగ్ కంటెంట్ డ్రైవన్ యాక్షన్ డ్రామా అనిపిస్తోంది. ఐతే సినిమాలో మరో క్రేజీ హీరోను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం.. మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒకవేళ ఇది నిజమైతే ఈ సినిమా పై భారీ హైప్ పెరుగుతుంది.. పూరి సెట్ చేస్తున్న కాంబినేషన్ చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.. గతంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫజిల్ కలిసి విక్రమ్ సినిమాలో నటించారు..









