Search
Close this search box.

  క్రేజీ కాంబో సెట్ చేస్తున్న పూరీ..! ఈసారి హిట్ పక్కా..?

పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్ పై రోజూ రోజుకు హైప్ భారీగా పెరుగుతుంది.. ఈ కాంబోలో వచ్చే సినిమా కోసం ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఐతే పూరి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.. గత సినిమాల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ఏ చిన్న మిస్టేక్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం.. అంతేకాదు పూరి మళ్ళీ తన వింటేజ్ డైరెక్షన్ తోనే ఈ సినిమాను తెరకెకిస్తున్నట్లు సమాచారం.. ఐతే పూరి స్టార్ కాస్ట్ నుండి తన మార్క్ ను చూపిస్తున్నాడు.. హీరోగా విజయ్ సేతుపతిని తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.. తర్వాత మరోసారి హీరోయిన్ గా సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ను తీసుకొని అందరినీ సర్ప్రైజ్ చేశాడు.. ఇప్పుడు మరోసారి మరొక హీరోయిన్ కూడా తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది.. అంతే కాదు ఈసారి పూరి కంటెంట్ పై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది..

రాధికా ఆప్టే సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి .. రాధిక గతంలో కొన్ని తెలుగు సినిమాలో నటించి మెప్పించింది..రాధిక నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా మారడమే కాకుండా, తెలుగులో మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడం సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఆమె పాత్ర ఏమై ఉంటుందా అనే కురియాసిటీ ఉంది. టబు లాంటి క్లాస్ నటిని తీసుకోవడమూ ఈ సినిమా బలంగా ఉండబోతుందని సంకేతం..విజయ్ సేతుపతికి ఇటీవలి మహారాజా’ లాంటి విజయం తో మంచి బజ్ ఉంది. ఆ హవా తెలుగులో కూడా ఎక్కువే. ఆయన పాన్-ఇండియా అప్పీల్ కలిగి ఉండటం వల్ల ఈ సినిమా నిజంగానే క్రేజీ కాంబినేషన్ అవుతుంది…ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ చూస్తే, పూరీ ఈసారి మాస్ + క్లాస్ + కంటెంట్ మిక్స్ చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది…

 

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు