టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు.. టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు తీసి మంచిపేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు.. ఐతే నిన్న దిల్ రాజు తన x ఖాతాలో ఓ బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుందాని పోస్ట్ పెట్టాడు.. ఆది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఈసారి ఏ స్టార్ హీరోతో సినిమా తీయబోతున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.. కానీ దిల్ రాజు చేసిన ప్రకటన నిజంగా ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినిమా నిర్మాణంలోనే కాదు, ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టి, ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి మార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు.. AI ఆధారిత మీడియా కంపెనీ స్థాపనతో తెలుగు చిత్రపరిశ్రమలో టెక్నాలజీకి ఓ నూతన దిశ ఏర్పడనుంది. క్వాంటమ్ AI గ్లోబల్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్, VFX, వర్చువల్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో అవకాశం ఉంది. మే 4న స్టూడియో పేరు, పూర్తి వివరాలు రివీల్ చేయబోతున్నారు అనే విషయం మరో ఆసక్తికర అంశం. ఇదంతా చూస్తుంటే, ఇండియన్ సినిమా టెక్నాలజీ విభాగంలో త్వరలోనే ఓ పెద్ద రివల్యూషన్ జరగబోతోందన్న భావన కలుగుతోంది.









