పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న “స్పిరిట్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్.. ఈసారి ప్రభాస్ తో పవర్ఫుల్ కాప్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు.. ఐతే ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది..
ఈ సినిమాల్లో కొరియన్, అమెరికన్ నటీనటులు ఉండబోతున్నారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో మరో స్టార్ట్ కూడా ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించనున్నట్టు బజ్ హల్చల్ చేస్తోంది. ఇది నిజమైతే, ప్రభాస్ – మమ్ముట్టి కాంబో సెట్ ఐతే మాత్రం ఫాన్స్ కు పండగే అని చెప్పాలి..
స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ప్రస్తుతం కాస్టింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు..









