మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కొణిదెల హీరోయిన్‌గా ప్రయత్నించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు దక్కించుకోలేకపోయింది… తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది..ఆ తర్వాత ఏవో కారణాలతో విడాకులు తీసుకొని మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చింది.. కానీ ఈసారి హీరోయిన్ గా కాకుండా ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చింది., నిర్మాతగా మారి ఆమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను నిర్మించి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, నిహారికను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టింది… తాజాగా, నిహారిక తన బ్యానర్‌పై రెండో సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించింది…. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించనుండగా, ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో హిట్లు కొట్టిన సంగీత్ శోభన్ హీరోగా నటించనున్నాడు… సంగీత్ తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు… మరి నిహారిక ఈసారి ఏ రేంజ్ హిట్ కొడుతుందో చూడాలి..









