Search
Close this search box.

  RC16 టైటిల్,ఫస్ట్ లుక్ రిలీజ్..! ఉరమాస్ లుక్ లో రామ్ చరణ్..!

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా నటిస్తున్న ‘ఆర్‌సీ 16’ కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది..ఈ సినిమా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ రోజు రామ్ చ‌ర‌ణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌సీ 16’ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుదల చేసిన మేక‌ర్స్, అలాగే ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు…

 

‘పెద్ది’ ఫ‌స్ట్‌లుక్‌లో రామ్ చ‌ర‌ణ్ గుబురు గ‌డ్డం, పొడ‌వాటి జ‌ట్టుతో అద‌ర‌గొట్టారు. ఊర‌మాస్ లుక్‌తో రామ్ చరణ్ రంగస్థలాన్ని మరోసారి గుర్తు చేశారు.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ మల్లా యోధుడిగా పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం… ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ సరసన బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుంది… ఇందులో శివ‌రాజ్ కుమార్, దివ్యేందు, జ‌గ‌ప‌తి బాబు వంటి భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమా రాబోతుంది..! ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’, ‘వృద్ధి సినిమాస్’, మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.. ‘పెద్ది’ సినిమా పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ ఉగాదికి “పెద్ది” నుండి టీజర్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు..అలాగే వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం..!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు