Search
Close this search box.

  గోపిచంద్ కు జోడిగా యంగ్ బ్యూటీ..?

గోపీచంద్ హీరోగా, ‘ఘాజీ’ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందుతోంది.. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం జరిగింది, మరియు త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..ఐతే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో గోపీచంద్ కి హీరోయిన్ గా రితికా నాయ‌క్ తీసుకున్నట్లు సమాచారం. ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రితికా, ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేవు, ఇప్పుడు వ‌రుణ్ తేజ్ సినిమాలో’ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది..అలాగే ఇప్పుడు గోపీచంద్, సంక‌ల్ప్ రెడ్డి సినిమాలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం..ఈ సినిమా ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన కథ, 7వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఉంటుంది.. ఈ సినిమా గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది.. విజువల్స్, మేకింగ్ విషయంలో సంకల్ప్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. గోపీచంద్ కెరీర్‌లో ఇది 33వ సినిమాగా రాబోతుంది..ఈ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు