ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా తో కలసి rc16 అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రాబోతుంది.., ఈ ప్రాజెక్ట్ పై ఆడియెన్స్ లో భారీ హైప్ ఉంది..
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ లైనప్ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ తప్ప ఇంకో దర్శకుడు పేరును ప్రకటించలేదు. కానీ, తాజాగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ సిరీస్ తో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్.. ఈ డైరెకర్ ఇప్పటికే ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.. వీటి తర్వాత రామ్ చరణ్ , ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సినిమా రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నిర్మించబోతునట్లు సమాచారం.., ఇది RRR వంటి సెన్సేషనల్ సినిమాను నిర్మించిన సంస్థ కావడంతో, మరింత క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది, కానీ ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం.. ఇదే రోజు రామ్ చరణ్ Rc16 నుండి గ్లింప్స్ రాబోతుంది..









