Search
Close this search box.

  అట్లీ,అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరో..? హీరోనా ,విలనా..?

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో ఒక కొత్త సినిమా రూపొందుతోందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హిట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న త్వరలో రానుంది, ప్ర‌స్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు మరియు అక్కడ క‌థా చ‌ర్చలు జరుపుతున్నారు. బ‌న్నీ తిరిగి ఇండియాకు రాగానే ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న ఇవ్వనున్నారు.

 

సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బ‌న్నీ డ్యూయ‌ల్ రోల్‌లో కనిపిస్తారు. ఒక పాత్రలో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయ‌ని, అంటే ఒక విధంగా విల‌న్ పాత్రలో కూడా కనిపించ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ రకమైన పాత్రతో ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రలు, హీరో మరియు విల‌న్ రెండు పాత్రలు బ‌న్నీనే పోషించనున్నారు…

 

ఇదిలా ఉంటే, పుష్ప సినిమాలో కూడా బ‌న్నీ పాత్రలో కొంత నెగిటీవ్ షేడ్స్ కనిపించాయి, కాబట్టి ఈ సినిమాకు సంబంధించి అత‌ని సిద్దం కావడం పెద్దగా క‌ష్ట‌ప‌డాల్సిన అవసరం ఉండదు.. ఐతే ఈ సినిమాలో బన్నీతో పాటు మరో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాట్లు వార్తలు వస్తున్నాయి.. ఐతే ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడా, విలన్ గా నటిస్తున్నడో తెలియట్లేదు.. సోషల్ మీడియాలో మాత్రం శివ కార్తికేయన్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నరాని వార్తలు వస్తున్నాయి.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. చూడాలి మరి ఈసారి అట్లీ ఐకాన్ స్టార్ తో ఎలాంటి సినిమా తిస్తాడో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు