మాస్ మహారాజా రవితేజ, భాగ్య శ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.. రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు..ఈ సినిమాతో భోగవరపు భాను అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.. ఐతే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలో రవితేజ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఐతే రవితేజ నెక్స్ట్ సినిమా “మ్యాడ్” సినిమాతో మంచి విజయాన్ని సాధించిన కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.., రవితేజతో ఈ సూపర్ హీరో సినిమాను రూపొందించనున్నాడు. ఫాంటసీ జోనర్‌లో కథ ఉంటుందనీ, ఈ సినిమాకు మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఉంటాయంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది.ఇండియాలో సూపర్ హీరో సినిమాల మీద క్రేజ్ పెరిగిపోవడంతో, రవితేజ కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం .. . మరి రవితేజ ఈ సూపర్ హీరో సినిమాలో ఎలా కనపడతారు, ఏ రకమైన పాత్రలో కనిపిస్తారు అనేది చూడాలి.









