సందీప్ రెడ్డి వంగ, తెలుగులో & హిందీలో ఉన్న క్రేజ్‌తో ఒక స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. అర్జున్ రెడ్డితో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయం అయ్యారు.. అప్పటి వరకు రాని ఓ లవ్ స్టోరీ రొమాంటిక్ గా తీసి ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు..ఆ తరువాత అర్జున్ రెడ్డి హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు…తర్వాత రణ్ బీర్ కపూర్‌తో చేసిన అనిమల్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..
ఇప్పుడు, ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సిద్ధమైన సందీప్, ఈ సినిమా మరింత హైప్‌తో తీసుకోనున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పవచ్చు.. అయితే, ఫౌజీ సినిమా తరువాత స్పిరిట్ ప్రారంభమవుతుందని సమాచారం వుంది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో ఉంటే, ఇందులో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..









