Search
Close this search box.

  rc16 రిలీజ్ డేట్ ఫిక్స్..? ఎప్పుడంటే..?

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాగా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఈసారి రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 27) సందర్భంగా పుట్టిన రోజు స్పెషల్ గా ఉండనుంది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ ను లాక్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా rc 16 టీం తెలిపింది.., “పెద్ది” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ టైటిల్‌ను పాన్ ఇండియా రేంజ్లో లేకపోవడంతో కొత్త టైటిల్ లాక్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.. ఈసారి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు టీజర్ కూడా లాంఛ్ చేయబోతున్నట్లు సమాచారం..

ఈ సినిమాలో క్రికెట్ సంబంధించిన ఓ సీన్ ఉన్నట్లు సమాచారం .. ఈ సీన్ లో ఎంఎస్ ధోని ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు