బలగం సినిమాతో డైరెక్టర్ గా వేణుకి మంచి పేరు వచ్చింది.. బలగం సినిమాకు ముందు వేణు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు… అంతకన్నా ముందు జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ అందరి నవ్వించేవాడు..కానీ బలగం సినిమాతో డైరెక్టర్ గా కొత్త రూపం ఎత్తాడు.. ప్రియదర్శి హీరోగా పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ అయ్యింది.. అంతేకాదు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి.. దీంతో వేణు నెక్స్ట్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలున్నాయి..ఐతే వేణు నెక్స్ట్ కూడా సినిమా పల్లెటూరి డ్రామా గా రాబోతున్నట్లు సమాచారం.. ఆ సినిమాకి టైటిల్ “ఎల్లమ్మ” అని ఎప్పుడో ఫిక్స్ అయింది.. కానీ ఈ సినిమా’ ప్రారంభంలోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. మొదట నాని హీరోగా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని దిల్ రాజు నిర్ణయించారు, కానీ నాని షెడ్యూల్ సమస్యలు మరియు ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు..ఆ తరువాత హీరోగా నితిన్ ను తీసుకున్నారు..
అదే విధంగా, హీరోయిన్ గా సాయి పల్లవి కూడా కథపై ఆసక్తి చూపించినప్పటికీ, షెడ్యూల్ కారణంగా ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా కీర్తి సురేష్‌ను తీసుకున్నట్లు సమాచారం..‘రంగ్‌దే’ సినిమా ద్వారా నితిన్, కీర్తి సురేష్ జోడి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఈ జోడీ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.









