Search
Close this search box.

  రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అఖిల్ కొత్త సినిమా..?

అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటి వరకు అఖిల్ నటించిన 5 సినిమాల్లో ఏ సినిమా కూడా అఖిల్ కు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు..ఎంతో కష్టపడి చేసిన  ‘ఏజెంట్’ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది, దీంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ పెడుతున్నాడు. అఖిల స్క్రిప్ట్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఓ సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం.. అంతే కాదు అఖిల్ తన స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ ప్యాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యాడు.

 

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వారం నుండి 20 రోజుల పాటు షెడ్యూల్ నిర్వహించి, 50% షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా, విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా, ఎక్కువ భాగం తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

 

ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడబోతుంది, మరియు చిత్తూరు జిల్లాలో ఎక్కువ షూటింగ్ జరగనుంది. ఇక, ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకునే అవకాశముందని, దసరా సీజన్‌లో సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు