పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపి ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సిఎం గా ప్రస్తుతం పాలిటిక్స్ బిజీ ఉన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు.. ఏపీ ఎన్నికలు రాకముందు పవన్ కళ్యాణ్ 4 సినిమాలకు కమిట్ అయ్యారు.. అందులో మొదటిగా ఏ.ఎం రత్నం ప్రొడ్యూసర్ గా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా హరిహర విరమల్లు.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా రాబోతుంది.. సుజీత్ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి.. ఈ నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఐతే రీసెంట్ గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గురుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. సుజీత్ డైరెక్షన్లో వస్తున్న ఓజీ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్టు ఓజి టీజర్ వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది.. ఐతే ఈ సినిమా రెండూ పార్ట్స్ గా రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా స్క్రిప్ట్ లెంగ్త్ అవ్వడంతో సుజీత్ ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తీద్దాం అని ఫిక్స్ అయ్యాడట..దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా రెండూ పార్ట్స్ గా వస్తున్నట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక మోహన్ నటిస్తుంది.. శ్రీరెడ్డి కీలక పాత్ర పోషిస్తుంది.. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇది గనక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగే అని చెప్పాలి..









