Search
Close this search box.

  ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్..?

పుష్ప సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు… నార్త్ లో ఈ పుష్ప సిరీస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ద రూల్ సినిమా ఇండియా వైడ్ గా 1800 కోట్ల కలెక్షన్ రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. బాలీవుడ్ లోనే 800 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ నుండి ఏ సినిమా వస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎురుచూస్తున్నారు.. ఐతే ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మైథాలజీ సినిమా చేయాలి కానీ ఆ సినిమా ఆగిపోయిందాని సమాచారం.. ఇక అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తాడంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు ఇది నిజమే అని తెలేస్తుంది.. ఈ సినిమాకు సంబంధించి అధికారిక త్వరలో రాబోతున్నాట్లు సమాచారం.. ఐతే అట్లీ సినిమా తరువాత ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెకర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఒకే చెప్పారట… ప్రస్తుతం నీల్ సలార్ 2తో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు.. ఈ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు సమాచారం.. ఈ కాంబోను నిర్మాత దిల్ రాజు సెట్ చేసినట్లు తెలుస్తుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు