Search
Close this search box.

  మెగాస్టార్ తో నాగ్ అశ్విన్ మల్టీస్టారర్..? మెగా ఫ్యాన్స్ కు పునాకలే..!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత సినిమాలు వరుసగా చేస్తున్నారు.. క్రేజీ యంగ్ డైరెక్టర్స్ సినిమాలు కమిట్ అవుతూ.. బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇకపోతే మెగాస్టార్ లాంటి స్టార్ తో సినిమా చేయడానికి యంగ్ డైరెక్టర్స్ కూడా ఆసక్తి చూపించడంతో మెగాస్టార్ కూడా స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమా భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా విఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం..ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు ప్రకటించారు మెగాస్టార్.. ఈ సినిమా తరువాత దసరా సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన ఓదెల శ్రీకాంత్ డైరెక్షన్లో ఓ గ్యాంగ్ స్టార్ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాలు కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్.. ప్రభాస్ తో కల్కి2898 ఎడి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమాకు మెగాస్టార్ కమిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ తో బిజీగా ఉన్నారు.. రీసెంట్ గా ఓ వేడుకలో మెగాస్టార్ కూడా నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి నేను రెడీ అని చెప్పాడు.. దీంతో నాగ్ అశ్విన్ మెగాస్టార్ కు స్టోరీ చెప్పగా వెంటనే ఒకే అన్నారట.. ఐతే ఇందులో మెగాస్టార్ రోల్ ఫుల్ లెంగ్త్ ఉండదంట కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంటుందట.. ఈ సినిమాలో ఇంకో స్టార్ హీరో ఉంటాడట… ఇది ఒక మల్టీస్టారర్ సినిమా అని తెలుస్తుంది.. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.. చూడాలి మరి ఎప్పుడు ఈ సినిమా మొదలు అవుతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు