యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. ఆర్.ఆర్.ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ క్రేజీ డైరెక్టర్స్ సినిమాలు చేస్తూ సాలిడ్ లైన్ అప్ సెట్ చేసుకున్నాడు.. ఆర్.ఆర్.ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేశాడు..ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 500 కోట్ల కలెక్షన్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది… ఆ తర్వాత బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ వార్ 2 లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.. ఇక కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత నీల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ చేశాడు.. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తున్నా సినిమా ఇది.. ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఇండియాను హిస్టరీలో రాని కొత్త కథ అని ఓ వేడుకలో ఈ సినిమా ప్రొడ్యూసర్ హింట్ ఇచ్చాడు.. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీను కూడా ఓ క్రేజీ డైరెక్టర్ తో సెట్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.. ఆ టిటైల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. డాక్టర్, బీస్ట్ ,జైలర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెకర్ నెల్సన్ దీలిప్ తో ఓ సినిమాకు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి..ఈ సినిమాకు “రాక్” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఇప్పుడు ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నట్లు సమాచారం..









