Search
Close this search box.

  “సూపర్” కాంబో రిపీట్..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, రాష్మిక మందన్న హీరోయిన్ గా వస్తున్నా కుబేర సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు.. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని పలు వేడుకల్లో నాగార్జున చెప్పారు.. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా వస్తున్న కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా కూలీలో కూడా నాగార్జున ఒక పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నారని టాక్.. ఈ రెండు ప్రాజెక్టులతో నాగార్జున బిజీ గా ఉన్నారు.. కానీ ఈ రెండు ప్రాజెక్ట్స్ లో నాగార్జున ఓ క్యమియో రోల్ చేస్తున్నాడు.. కానీ నాగార్జున సోలోగా ఇంకా ఏ సినిమాకు కూడా సైన్ చేయలేదు.. టాలివుడ్ సీనియర్ హీరోలంతా సోలోగా సినిమాలు చేస్తున్నారు.. మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్ ఈ సీనియర్ హీరోలో సోలో సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులను బద్దలు కొడుతున్నారు..కానీ ఈ జాబితాలో ఉన్న నాగార్జున మాత్రం జస్ట్ క్యామియో రోల్ సినిమాలు చేస్తున్నాడు.. నాగార్జున సోలో హీరోగా సినిమా వచ్చి చాలా రోజుల అయింది.. ఐతే నాగార్జున ఇప్పుడు ఓ సోలో సినిమాతో రాబోతున్నట్లు సమాచారం. నాగార్జునతో రెండు సినిమాలు తీసిన ఈ డైరెకర్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.. ఆ డైరెక్టర్ ఎవరంటే.. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ఫాప్స్ తో సతమతమవుతున్నాడు.. పూరీ తీసిన గత రెండు సినిమాలు లైగర్, డబల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి.. ఐతే పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.. పూరీ నాగార్జున కలిసి కథ చెప్పినట్లు సమాచారం.. ఆ కథ నచ్చడంతో నాగ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.. గతంలో ఈ కాంబోలో సూప‌ర్‌, శివ‌మ‌ణి సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి.. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను నాగార్జున ఒప్పుకున్నారట.. చూడాలి నాగ్, పూరీ కాంబో లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా ఎలా ఉండబోతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు